హిందూపురం టౌన్, న్యూస్‌లైన్: హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గం ఐదేళ్ల పాలన కాలం శనివారంతో ముగిసింది. ఐదేళ్లపాటు పాలర సజావుగా సాగేందుకు సహకరించిన కౌన్సిలందరికీ మున్సిపల్ చైర్మన్ అనిల్‌కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో నీటి సమస్య పరిష్కారం, మున్సిపల్ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాల పంపిణీ మరచిపోలేని ఘట్టాలన్నారు. అనుకున్న పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోయామన్నారు.
పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి లైట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేకపోయామన్నారు. కొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ అధికారులు, చైర్మన్ చొరవతో వార్డులను అభివృద్ధి చేసుకున్నామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్‌ను, కమిషనర్, అధికారులను కౌన్సిలర్లందరూ సన్మానించి మెమొంటోలను అందజేశారు.
కబ్జాల ‘పురం’
హిందూపురం, న్యూస్‌లైన్: హిందూపురంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురువుతున్నాయి. కంచే చేను మేసిన చందంగా మున్సిపల్ ఆస్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన కౌన్సిల్ సభ్యులు, వారి బంధువులే కబ్జాలకు పాల్పడుతున్నారు. అధికార, ప్రతి పక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, వారి అనుచరు శ్మశానాలు, నీళ్ల ట్యాంకులు, సామూహిక మరుగుదొడ్లు, మురికి కాలువలు, చెరువులు, కాలువ గట్లూ ఇలా వేటినీ వదలడం లేదు.
ఆక్రమణలను అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్లకు లొంగి చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ పరిధిలోని కొట్నూరుచెరువు, సూరప్పకుంట చెరువు, శ్రీకంఠపురం చెరువుల ఆక్రమణలపై లోకాయుక్త స్పందించేవరకూ అధికారుల్లో చలనం లేకుండాపోయిందంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలాజీ టాకీస్‌రోడ్డులో అంబేద్కర్‌నగర్‌కు చెందిన శ్మశానవాటికను కొందరు వ్యక్తులు ఆక్రమించి దుకాణసమాదాయాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో నిర్మించిన నీటి ట్యాంకును ఆక్రమించి సెల్‌ఫోన్ దుకాణంగా మార్చేశారు. ధనలక్ష్మీ రోడ్డు, కంసలపేట, మెయిన్‌రోడ్డు, బెంగళూరు రోడ్డులో పట్టణాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రముఖులపేరుతో నిర్మించిన ట్యాంకులు ఆక్రమణదారుల పరమవుతున్నాయి. నానెప్ప నగర్‌లో లక్షల రూపాయల విలువ చేసే మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైంది.
ఆబాద్‌పేటలో సామూహిక మరుగుదొడ్లను కూల్చివేసి దాని స్థానంలో ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. పెనుకొండ రోడ్డులోని ఖాళీ స్థలాల్లో రోజుకొకటి చొప్పున బంకులు వెలుస్తున్నాయి. కొట్నూరు చెరువు కట్టపైన, కాలువ గట్టుపైన పెద్ద ఎత్తున భవనాలు వెలిశాయి. ఆక్రమణ దారులకు ప్రజా ప్రతినిధుల అండదండలుండటంతో వారిని ప్రశ్నించేందుకు అధికారులు జంకుతున్నారు. కొట్నూరు చెరువు, శ్రీకంఠపురం, సూరప్పకుంట చెరువుల్లో వందలాది భవనాలు వెలిశాయి. ఏకంగా మూడు, నాలుగంతస్థులు భవనాలనే నిర్మించుకొన్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా లోకాయుక్త స్పందించి వాటిని తొలగించాలని ఆదేశించడంతో అటు అధికారుల్లోనూ, ఇటు ఆక్రమణదారుల్లోనూ కలవరం రేగింది. ఈ అంశాన్ని రాజకీయ నేతలు తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో ఎవైరైనా ఇళ్లు లేనివారు గుడిసె వేసుకొంటే ఇంతనీడ కోసం అలాచేసారనుకోవచ్చు. ఓ నిరుద్యోగి పెడదోవపట్టకుండా చిన్న బంకుపెట్టుకొని జీవిస్తుంటే సరిపెట్టుకోవచ్చు.
అయితే పట్టణంలో మెజార్టీ ఆక్రమణలు అమ్మకాల కోసమో, బాడుగల కోసమో జరుగుతున్నవే. ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలోనే పట్టణంలోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపై అటు మున్సిపల్ అధికారులు గాని, ఇటు రెవిన్యూ అధికారుల గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం సెంటు స్థలం కూడా మిగలదనేది నిష్టూర సత్యం.

No comments:
Post a Comment